Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay ) కు హైకోర్టు (High Court) లో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా, తాజాగా హైకోర్టు కొట్టివేసింది.