Amrapali:ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట .. మళ్లీ తెలంగాణకే

తెలంగాణ నుంచి రిలీవై ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో చేరిన ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలి (Kata Amrapali) కి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ( క్యాట్)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణ (Telangana)కు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె క్యాట్ (Cat ) లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను అనుమతించిన క్యాట్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.