CV Anand : హైదరాబాద్ పోలీస్‌కు అరుదైన గౌరవం

మాదకద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు విభాగంలో మొదటిస్థానం దక్కింది. దుబాయ్ (Dubai)లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (డబ్ల్యూపీఎస్) 2025లో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ (CV Anand ) ఈ పురస్కారం అందుకున్నారు. మూడేళ్ల క్రితం ఆయన సారథ్యంలో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌న్యూ ) ఏర్పడిరది. గోవా(Goa), బెంగళూరు (Bangalore) కేంద్రాలుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల వినియోగంతో తలెత్తే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు డ్రగ్స్ నియంత్రణలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఈ సమ్మిట్‌లో 138 దేశాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. ప్రపంచవ్యాప్త పోలీసింగ్‌తో పోటీపడుతూ నగర పోలీసులు, హెచ్‌న్యూ మొదటిస్థానం సాధించడం తెలంగాణ, భారతీయ పోలీసులందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు.