Ramakrishna Rao : తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ( సీఎస్)గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (Ramakrishna Rao)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి (Shanthi Kumari) ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది. ఆయనతో పాటు పలు కీలక శాఖల అధిపతులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులు చేపట్టింది. యువజన శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ (mita Sabharwal )ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ(Member Secretary, Finance Commission) పోస్టులోకి బదిలీ చేసింది.