BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును పార్టీ హైకమాండ్ నియమించనుంది. సోమవారం ఉదయం ఈ మేరకు అధికారికంగా సమాచారం అందింది. ఇప్పటివరకు ఈ పదవికి పలు కీలక నేతల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరకు రామచందర్ రావు పేరు ఖరారైంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లతోపాటు రామచందర్ రావు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆరెస్సెస్ ఆశీర్వాదంతో పాటు, సీనియర్ నేతల మద్దతు రామచందర్ రావుకు లభించడంతో ఆయన పేరును హైకమాండ్ ఖరారు చేసింది.