Ram Atmakuri : బోస్టన్ సైట్ బోర్డు సభ్యుడిగా రామం ఆత్మకూరి

ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా సేవలందించిన రామం ఆత్మకూరి (Ram Atmakuri) బోస్టన్ సైట్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బోస్టన్ సైట్ సీఈఓ సారా యోస్ట్ (Sarah Yost) మాట్లాడుతూ బోర్డు సభ్యుడిగా ఆయన వ్యూహాత్మక నాయకత్వం, సేవలు తమ సంస్థకు దోహదపడతాయని అన్నారు. వైద్యరంగం పరిశోధనలు, ఆవిష్కరణలతో విస్తరిస్తున్న సమయంలో ఆయన అనుభవం తమకు ఎంతో అమూల్యమైనద ని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామం ఆత్మకూరి మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి (LV Prasad Hospital) ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు చిహ్నంగానే ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నానని అన్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో రుమటాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి (Sarath Chandramouli)కి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్‌సీపీ) నుంచి ఫెలోషిప్ లభించింది. వైద్యరంగంలో చేసిన అసాధారణ సేవలు, సాధించిన విజయాలకు గుర్తింపుగా అందిన అదిపెద్ద గౌరవమని వైద్యులు తెలిపారు. ఆయనకు రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని చెప్పారు. డా.శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ తనకు లభించిన గౌరవంతో ప్రజారోగ్యం కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.