Bharat Summit: యువతరం రాజకీయాల్లోకి రావాలి : రాహుల్ గాంధీ

పాతతరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడంతా యంగ్ అండ్ న్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయి.. యువత రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ (Bharat Summit) లో పాల్గొన్న రాహుల్ గాంధీ దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, దేశం, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న ప్రేమ, ప్రజలకు ఏం చేయాలని పార్టీ అనుకుంటుందో వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. గడిచిన పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్నారు. విపక్షాలు తమ గొంతు వినిపించేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు రాహుల్ గాంధీ. పాతతరం రాజకీయం అంతరించి పోయింది. ఇప్పుడంతా యంగ్ అండ్ న్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాజకీయాల్లోకి కొత్త తరం(యువత) రావాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ.