Rahul Gandhi: రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి : రాహుల్ గాంధీ

గత ఐదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) లో జరిగిన భారత్ సమ్మిట్ (Bhatath Summit )లో ఆయన మాట్లాడారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టికొచ్చి, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కన్యాకుమారి (Kanyakumari) నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు రాహుల్ గుర్తు చేసుకున్నారు. పాదయాత్రకు ముందు చాలా ఆలోచించానని, అయితే, మొదలు పెట్టిన తర్వాత వెనకడుగు వేయలేదని అన్నారు. ఆ తర్వాత చాలా మంది తనతో కలిసి నడవడం మొదలు పెట్టినట్లు చెప్పారు.