Raghunandar Rao: ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు : ఎంపీ రఘునందర్‌రావు

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandar Rao) కు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశారు. తాను మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ (Medical) జిల్లా దమ్మాయిగూడ (Dammaiguda)లో ఓ ప్రైవేటు పాఠశాల (School) కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.