Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌బీఐ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) సిట్ ఎదుట మూడోసారి విచారణకు హాజరయ్యారు. అమెరికా (America) నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయనను సిట్ బృందాలు రెండుసార్లు సుదీర్ఘంగా ప్రశ్నించాయి. ఇవాళ మూడోసారి విచారణకు పిలిచింది. మరో వైపు శుక్రవారం ప్రణీత్‌రావు (Praneetha Rao)ను విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి నమోదు చేసిన వాంగ్మూలం ద్వారా ప్రభాకర్‌రావును ప్రశ్నించనున్నారు. ప్రణీత్‌రావును కూడా ప్రభాకర్‌రావుతో కలిసి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? హార్డ్ డిస్క్ (Harddisk)లను ఎవరి ఆదేశాలతో ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ (Phone tapping) చేశారు. వారిలో అధికారులతో పాటు రాజకీయ నేతల ఫోన్లు కూడా ఉన్నాయా? అనే కోణాల్లో వారిద్దరిని విచారించనున్నారు.