లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ : మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను సచివాలయంలో మంత్రి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులను మంత్రి సూచించారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేసి వచ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తాం. ఇందుకు చేయాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని సూచించా. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ళ కేటాయింపు వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వినియోగించుకోవాలి. పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు.