Phone Tapping: అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రభాకర్‌రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) కు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్‌ను అమెరికాలోని భారత ఎంబసీ (Indian Embassy) జారీ చేసింది. పాస్‌పోర్టు (Passport) ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్‌కు బయలుదేరి ఈ నెల 8న అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రభాకర్‌రావు 9న ఉదయం సిట్ ఎదుట హాజరుకానున్నారు.