తెలంగాణలోనూ ‘సెంచరీ‘ కొట్టిన పెట్రో ధర

దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. మరికొన్ని చోట్ల పెట్రో ధర సెంచరీ కూడా కొట్టేసింది. పెట్రో, డీజిల్ ధరల పెంపుపై ప్రజలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా, ధరలు తగ్గించడానికి ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు. ఏపీలోని గుంటూరులో పెట్రో ధర 100 రూపాయలకు చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు కోవిడ్ అని, ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ సమయంలో పెట్రో మంటలేంటని అగ్గిమీద గుగ్డిలమవుతున్నారు. ఈ పెట్రో సెంచరీ ధర తెలంగాణకు తాకలేదని అనుకుంటుండగానే, హైదరాబాద్‌లోనూ పెట్రోలు ధర సెంచరీ కొట్టేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 20 పైసలు. లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 14 పైసలు. దీంతో సిటీ జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు…. తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ పెట్రో ధర సెంచరీ కొట్టేసింది. హైదరాబాద్ : 100 రూపాయల 20 పైసలు, కరీంనగర్: 100 రూపాయల 0.7 పైసలు, ఆదిలాబాద్: 102.02, ఖమ్మం: 100.25,నల్లగొండ : 100.22, మహబూబ్ నగర్: 101.15, నిజామాబాద్: 102.08, మెదక్: 101.20, నిర్మల్: 101.74 గా ఉంది.