Pawan Kalyan: బీజేపి వాళ్లకు ఫీజులు ఎగిరే కామెంట్స్.. అందుకేనా…?

రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో అంచనా వేయడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు అలాగే రాజకీయ పార్టీలు అధినేతల వ్యాఖ్యలు ఎప్పుడు సెన్సేషన్ అవుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఒకటే అనే సంకేతాలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన కొన్ని కామెంట్ సెన్సేషన్ అవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిపాలన విషయంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమను ఆయన బాగా చూసుకుంటున్నారు అంటూ… ఎన్నో సదుపాయాలు కల్పించిన వాటిని సరిగా సినిమా పరిశ్రమ వినియోగించుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమ మీదే పవన్ కళ్యాణ్ చేసినా… బిజెపి నేతలకు మాత్రం ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఒకవైపున తెలంగాణలో తాము రేవంత్ రెడ్డి పై పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎలా మాట్లాడుతారు అంటూ వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ కోసమే ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
సినిమా వాళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండటంతో ఆయనను కాస్త శాంతింప చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి… దానికి తోడు ఎన్డీఏలో కీలక నాయకుడు కావడంతో ఈ వ్యాఖ్యలకు కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలో అంత మంచి పరిపాలన ఏం కనపడిందంటూ ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డికి బిజెపికి పెద్ద దూరం ఉన్నట్లు కూడా ఈ మధ్యకాలంలో ఎటువంటి సంకేతాలు రావటం లేదు. కేంద్ర మంత్రులతో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సన్నిహితంగానే మెలుగుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా కామెంట్స్ చేసి ఉండవచ్చు అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఒపీనియన్స్ వస్తున్నాయి.