KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరు కానున్నారు. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సు (Oxford India Forum Summit) లో ముఖ్యవక్తగా పాల్గొనాలని కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఇంగ్లండ్ (England) లో 2025 జూన్ 20, 21 తేదీల్లో ఈ సదస్సును, భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకుడు సిద్దార్థ్ సేఠీ (Siddharth Sethi) తెలిపారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే, చర్చలు మరింత ఆసక్తికరంగా ఉండడంతో పాటు, భారతదేశ అభివృద్ధి (India’s development) ప్రస్థానంలో భాగమవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని సిద్దార్ధ్ సేఠి ప్రస్తావించారు.