Revanth Reddy: మహిళలు కోటీశ్వరులు కావాలనేదే మా లక్ష్యం : సీఎం రేవంత్

మహిళలే దేశానికి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ (WeHub Women Acceleration) కార్యక్రమానికి సీఎం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ (Indira Gandhi) చూపించారు. రాష్ట్రంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి. మహిళల కోసం ఆర్టీసీ బస్సు (RTC bus)లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చాం. ఆడబిడ్డలకు రూ.500కే సిలిండర్ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. ఈ నెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు (Miss World contestants )సందర్శిస్తారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలి. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారు. మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు అని తెలిపారు.