NVSS Prabhakar: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ : ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకు బీఆర్‌ఎస్ నేతలు అపసోపాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఎంత డొల ప్రాజెక్టో ఎన్డీఎస్‌ఏ (NDSA) నివేదిక చదవి తెలుసుకోవాలన్నారు. ఐఐటీలో చదువుకున్న అత్యుతన్న మేధావులు, నిపునుల బృందం కాళేశ్వరం సందర్శించి లోపాలను ఎత్తిచూపిందన్నారు. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలు, మొరాయించిన మోటార్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎన్డీఎస్‌ఏ స్పష్టంగా వెల్లడిరచింది. అయినా ఎన్డీఎస్‌ఏ నివేదికను బీఆర్‌ఎస్ నేతలు తప్పుపట్టాడాన్ని ఖండిస్తున్నా. పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు కారుకూతలు కూశారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతిని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పిన మాటలు మర్చిపోయారా? అసెంబ్లీ లోపల, బయట కూడా సీఎం, మంత్రులు కాళేశ్వరం అవినీతిపై మాట్లాడారు కదా? పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్రచేందుకు కుట్ర జరుగుతోంది. బీఆర్‌ఎస్ చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. కాళేశ్వరంపై సీబీఐ (CBI) విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.