NVSS Prabhakar: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం : ప్రభాకర్

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు ఇటీవల హాజరైన వ్యక్తులు క్యాబినెట్ నిర్ణయం మేరకే అంతా జరిగిందని చెప్పారని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పించుకోవడానికే ఇలా కాకమ్మ కథలు చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ (KCR) బహిరంగ విచారణ వద్దని అనడంలోనే అసలు ఉద్దేశం తెలుస్తోందన్నారు. బండారం బయటపడుతుందని అలా అడిగారని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ తప్పులు జరుగుతున్నా సరిచేయలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీలు కుంగిన మాట వాస్తవం కాదా? తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్ట్ లొకేషన్‌ను రాజకీయ కారణాలతోనే మార్చారు. అంచనాలు పెంచడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) సమాధానాలు రాబట్టాలి. గత ప్రభుత్వ అవినీతిని బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అని అన్నారు.