Pakistani: రేపటిలోగా వెళ్లిపోండి.. నలుగురు పాక్ పౌరులకు నోటీసులు

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు (Police) తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరు (Pakistani citizens) లకు పోలీసులు నోటీసులు(Notices) ఇచ్చారు. వీరు షార్ట్ టర్మ్ వీసా (Short-term visa)లతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ (Hyderabad) విడిచి వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో మొత్తం 213 మంది పాకిస్థానీయులు(Pakistanis) ఉన్నట్లు గుర్తించారు.