High Court:జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ వద్దు : హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) , మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐ (CBI ) కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 7కి వాయిదా వేసింది.