Etala Rajender : ఐపీఎస్ అధికారి కాదు అయినా, ఎస్‌బీఐ చీఫ్‌గా : ఈటల

ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. హుజూరాబాద్ (Huzurabad) లో, 2023లో గజ్వేల్ (Gajwel)లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు. మునుగోడు (Munugod) ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు. ప్రభాకర్‌రావు ఐపీఎస్ అధికారి కాదు. అయినా, ఎస్‌బీఐ చీఫ్‌గా నియమించారు. విశ్రాంత అధికారిని అక్రమంగా నియమించారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్యం విరుద్ధం. జడ్జిలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేది. కాళేశ్వరంపై కమిటీ నివేదికను ఇంకా బయటపెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి ఏడాదిన్నర కావొస్తుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లాలూచీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు భయటపెట్డడం లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.