MP Chamala: ఆయన లేరు కాబట్టి కేటీఆర్ ఏమైనా చేస్తారు : ఎంపీ చామల

ఫార్ములా ఈ-రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ (Arvind Kumar) కీలకమైన వ్యక్తి అని కానీ ఇప్పుడు ఆయన కనిపించట్లేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) చెప్పారు. కేటీఆర్ ఏసీబీ (ACB) విచారణ హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లయినా జైలు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. అరవింద్ కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆయన లేరు కాబట్టి ఏమీ కాదని కేటీఆర్ (KTR) భావిస్తున్నారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానకి కేటీఆర్ ఏమైనా చేస్తారు. గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ (Kedar) విదేశాల్లో చనిపోయరు. కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్ అమెరికా వెళ్లి దాకున్నారు అని ఆరోపించారు.