Mohammad Azharuddin: అజారుద్దీన్ కు మంత్రి పదవి?

తెలంగాణ కేబినెట్‌లో మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ (MLC) లుగా ఫ్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తో పాటు అజారుద్దీన్ పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అయిన మహమ్మద్ అజహరుద్దీన్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మురాదాబాద్ (Moradabad) (ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టోంకో ( రాజస్థాన్) నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణకు తిరిగొచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2023లో జూబ్లీహిల్‌స ((Jubilee Hills) ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధిష్ఠానం వద్ద మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టాలని నిర్ణయించడం గమనార్హం.