Kavitha: నాపై దుష్ప్రచారం చేశారు…కవిత

భారత రాష్ట్ర సమితి లోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని, ‘‘మా కుటుంబం బాగుండొద్దు.. మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా కుటుంబం బాగుండొద్దు.. మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. దీనిలో భాగంగా మొదటిగా నన్ను బయటకు పంపించారు అని కవిత వ్యాఖ్యానించారు.