Kavitha : ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే : కవిత

రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు నోటీసులు ఇచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు (Notices) ఇచ్చారని ప్రశ్శించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ భూములను నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్, కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలి. బీజేపీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయం. గోదావరి-బనకచర్లను ఆపే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలన్నారు.