MLA Sanjay :కౌశిక్ రెడ్డి స్వతహాగా చేశారా?.. ఎవరైనా రెచ్చగొడితే చేశారా? : సంజయ్

హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) వీధిరౌడీలా తనపై దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Sanjay) అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి స్వతహాగా చేశారా? ఎవరైనా రెచ్చగొడితే చేశారా? అనేది తేలాలి. ఘటనపై స్పీకర్ (Speaker)కు ఫిర్యాదు చేశా. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. గతంలో ఇతర పార్టీల నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై కేసీఆర్ (KCR), కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పి కేసీఆర్, కేటీఆర్(KTR) రాజీనామా చేస్తే నేను కూడా చేస్తా అని అన్నారు.