Malreddy : అవసరమైతే తాను రాజీనామా చేసి…వేరేవాళ్లని గెలిపిస్తా

రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా(Resignation) చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లా (Rangareddy District )కు మంత్రి పదవి ఉండాలని చెప్పారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి, ఎవరినైనా గెలిపిస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ (Congress) కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని కోరారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలని, పదవులు కాదన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవులు (Ministerial positions) ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టడం సరికాదని చెప్పారు.