Yadagirigutta: యాదగిరిగుట్టను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

మిస్‌వరల్డ్ పోటీదారులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ గెస్ట్‌హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో చేరుకున్న సుందరీమణులు అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerla Ailaiah) కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి (Veera Reddy) , ఆర్డీవో కృష్ణారెడ్డి (Krishna Reddy) , ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు.