Miss World: ఓరుగల్లులో అందాల భామల సందడి

ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే సుందరీమణులు చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అతిథులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ (Bathukamma), మేళతాళాలతో స్థానిక మహిళలు, జిల్లా కలెక్టర్ ప్రావీణ (District Collector Praveena) , సీపీ సన్‌ప్రీత్‌సింగ్ (CP Sanpreet Singh), ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. రామప్ప ఆలయం (Ramappa Temple) వద్ద చీరకట్టులో మెరిసిన అందాల భామలు గ్రూప్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. రామప్ప ఆలయ విశిష్టతను టూరిజం గైడ్లు వారికి వివరించారు. అంతకుముందు హరిత కాకతీయ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రెండు బృందాలుగా ఏర్పడి వరంగల్ (Warangal) నగరంలో పర్యటించారు.