Miss World: మిస్ వరల్డ్ పోటీలకు సిద్దమైన హైదరాబాద్

ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ (Hyderabad) నగరం అందంగా ముస్తాబు కానుంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ (Hitex)లో జరిగే ఈ పోటీల కోసం జీహెచ్‌ఎంసీ రూ.1.70 కోట్ల అంచనాతో ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు చార్మినార్ (Charminar), ట్యాంక్‌బండ్ (Tankbund), రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో థీమాటిక్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, ఎల్‌ఈడీ విద్యుద్దీపాలతో ప్రపంచ సుందరి కిరీటం నమూనాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.