Miss World : శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌ల సందడి

హైదరాబాద్ నగరంలోని శిల్పారామం (silparamam)లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు సందడి చేశారు. అక్కడ కలియ తిరుగుతూ వివిధ స్టాళ (Stall ) ను పరిశీలించారు. విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతకుమందు శిల్పారామం వద్ద పలువురు కళాకారులు (Artists) , చిన్నారులు సంప్రదాయ రీతిలో వారికి స్వాగతం (Welcome) పలికారు. తెలంగాణ సంస్కృతీ (Telangana culture) సంప్రదాయాలకు సుందరీమణులు మంత్రముగ్ధులయ్యారు.