Miss World : నీరా తాగిన మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు

ప్రపంచ దేశాల సుందరీమణులు తెలంగాణ సంప్రదాయ పానీయం నీరా (Neera) రుచి చూశారు. ప్రకృతి ప్రసాదించిన పోషకాల పానీయాన్ని ఇష్టంగా తాగారు. కొబ్బరినీళ్లలా (Coconut water) భలేగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. అలాగే దొన్నెల్లో అందించిన తాటి ముంజలను ఎలా వలుచుకోవాలో ఆసక్తిగా తెలుసుకుని ఆరగించారు.మిస్ వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన అందగత్తెలు నెక్లెస్‌రోడ్డులోని నీరా కేఫ్ (Neera Café)లో సందడి చేశారు. గీత కార్మికులు తాటి దొన్నెల్లో, ప్రత్యేక టిన్నుల్లో వారికి నీరా అందించారు. అందాల పోటీలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం ఎక్కువ మంది భామలు హోటల్ (Hotel)కు పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. కొంత మంది మాత్రం విడతల వారీగా హుస్సేన్‌సాగర్ (Hussain Sagar)తీరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నృత్యాలు (Dances) చేస్తూ సందడి చేశారు.