Miss World: హైదరాబాద్ చేరుకుంటున్న అందాల భామలు

గ్రామీణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ (Miss World) 2025 పోటీలను అవకాశం గా మలచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. తెలంగాణ గ్రామీణ, సాంస్కృతిక (Cultural) , చారిత్రక, పర్యాటక వైభవాన్ని చాటిచెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌లో రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని (Rural tourism) హైలైట్ చేయనున్నారు. మిస్ వరల్డ్ అసలు పోటీలు ఈ నెల 17 నుంచి మొదలుకానున్నాయి. దాదాపు 110 దేశాల నుంచి వస్తున్న అందగత్తెలు తొలి వారమంతా తెలంగాణలో రెండు బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు. మన చారిత్రక కట్టడాలు (Historical monuments) , సంస్కృతిని వీరికి పరిచయం చేస్తారు. ఆ తర్వాతే అసలుసిసలు పోటీ మొదలవుతుంది.
అందాల పోటీల వేడుకల ప్రారంభానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో వివిధ దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మంగళవారం వరకు 28 మంది రాగా, బుధవారం 40 మందికి వచ్చారు. కజఖ్‌స్థాన్, సింగపూర్, డెన్మార్క్, కెన్యా, శ్రీలంక, బెల్జియం తదితర దేశాల సుందరీమణులు వచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.ఈ నెల 10న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించనున్న నేపథ్యంలో రెండు రోజులపాటు పోటీదారులు స్టేడియంలో రిహార్సల్స్ చేస్తారని సమాచారం.