Miss World: నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

మిస్ వరల్డ్ (Miss World) పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాల మేళవింపుతో జరగనున్న 72వ ప్రపంచ సుందరి వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందీమణులు పాల్గొంటున్నారు ఈ నెల 31 వరకు జరగనున్న పోటీలకు హైదరాబాద్‌లోని వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 2024 ప్రపంచ సుందరి చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా (Kristina Pizkova) తోపాటు మిస్ మాంటి నీగ్రో ఆండ్రియా నికోలిక్ (Andrea Nikolic), మిస్ అల్బేనియా ఎలోనా డ్రెకాజ్ (Elona Drekaz) హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport ) లో వారికి సంప్రదాయ విధానంలో స్వాగతం పలికారు.