Miss World: మిస్‌వరల్డ్ టాప్-24లో భారత్ … 84 దేశాలు ఔట్

తెలంగాణ ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ -2025 పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీలో పాల్గొన్న 108 దేశాల సుందరీమణుల నుంచి టాప్-24 జాబితాను మిస్‌వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఇందులో భారత్‌కు ప్రాతినిధ్యం వమిస్తున్న గుప్తా సహా (gupta saha) , 4 ఖండాల నుంచి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూరప్‌లోని పోలండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ (Germany), నెదర్లాండ్స్ , వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది ఉన్నారు. ఇక అమెరికా- కరేబియన్ ఖండం నుంచి అమెరికా (America), బ్రెజిల్, జమైకా అర్జెంటినా, కేమెనా ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. కాగా ఆసియా-ఓసియానా ఖండం నుంచి భారత్ (India) , శ్రీలకం, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు. ఆఫ్రికా నుంచి నైజీరియా, ఇథియోపియా, కామెరూన్, కెన్యా దేశాల సుందరీమణులు ఉన్నారు. రెండు రోజుల్లో మొత్తం 108 మంది ఈ పోటీలో పాల్గొన్న అనంతరం టాప్-24 జాబితాను ప్రకటించారు. దీంతో మిగతా 84 దేశాల పోటీల నుంచి వైదొలిగాయి.