Miss World : మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్‌గా ఇండోనేసియా సుందరి

తమ ప్రతిభాపాటవాలను మిస్ వరల్డ్ (Miss World) పోటీదారులు చాటుకున్నారు. పోటాపోటీగా నైపుణ్యాలను ప్రదర్శించారు. శిల్పకళా వేదిక (Shilpa Kala Vedika )గా జరిగిన మిస్ వరల్డ్ టాటెంట్ ఫినాలే (Miss World Tatent Finale ) లో 24 దేశాల అందగత్తెలు పోటీపడగా ఇండోనేసియా భామ మోనికా కేజియా సెంబిరింగ్ (Monica Kejia Sembiring) పియానో వాయిస్తూ, పాటపాడుతూ మైమరిపించి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మిస్ కామెరూన్ ఇస్సే ప్రిన్సెస్ నిలవగా, ఇటలీ భామ చైరా ఎస్పోసిటీ తన బ్యాలే నృత్వంతో ఆకట్టుకుని మూడో స్థానం సాధించారు. సుమారు మూడు గంటల పాటు హైదరాబాద్ శిల్పకళావేదికలో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. పోటాపోటీగా సాగిన ఆటపాటలు అందరినీ అలరించాయి.
Tags