Miss India: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మిస్ ఇండియా నందినీ గుప్తా

తెలంగాణలో ములుగు జిల్లా వెంకటాపురంలో మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని మిస్ ఇండియా (Miss India) 2023 విజేత నందిని గుప్తా (Nandini Gupta) సందర్శించారు. రామలింగేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప ఆలయ చరిత్రను అధికారులు ఆమెకు వివరించారు. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు (Miss World Competitions) జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంలో చేసింది. ఇందులో భాగంగా మే 14న సుందరీమణులు రామప్పకు రానున్నారు. రాజస్థాన్ (Rajasthan)కు చెందిన నందిని గుప్తా ముందుగానే రామప్ప ఆలయాన్ని (Ramappa Temple) సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.