Bhatath Summit:10 ఏళ్లలో సాధించలేనిది … మేం ఏడాదిన్నరలోనే సాధించాం

కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం పనులతో ప్రాజెక్టులను నాశనం చేసిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ (Bhatath Summit ) లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project ) లో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకూ ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్‌ఏ (NDSA) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, ఇంత మొత్తంలో వృథా చేస్తే ఇతర దేశాల్లో పెద్ద శిక్షలు పడేవన్నారు. రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా అత్యధిక పంట పండిరది. యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్నం పండిరది. తాజాగా సీతారామసాగర్ (Seetharamasagar) , సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి ఇచ్చింది. ఏడాదిన్నరగా మేం చేసిన కృషి ఫలించింది. తెలంగాణకు ఇది పెద్ద ముందడుగు. దశాబ్దకాలంగా బీఆర్‌ఎస్ సాధించలేనిది. మేం ఏడాదిన్నరలోనే సాధించాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకం. ఈ రెండు ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తాం అని తెలిపారు.