Uttam Kumar Reddy: దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో : మంత్రి ఉత్తమ్

ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నీటిపారుదల, పౌరసరఫరాల శాఖలపై హనుమకొండ కలెక్టరేట్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddita ) తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమని చెప్పారు. రేషన్ దుకాణాల్లో (Ration shops) సన్నబియ్యం పంపిణీని చరిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీకి మించిన సంక్షేమ పథకం మరొకటి లేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు (Devadala Project) పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. ఈ శాఖలోని అన్ని సమస్యలను రెండేళ్ల అధిగమిస్తామన్నారు. సీతమ్మసాగర్ (Seethamma Sagar) కు 68 టీఎంసీల జలాలు కేటాయించామన్నారు. కేంద్రంతో అనేక సార్లు చర్చించి నీటి వాటాను దక్కించుకున్నట్లు తెలిపారు.