Ujjain Mahankali : సికింద్రాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా విధంగా : మంత్రి పొన్నం

సికింద్రాబాద్ (Secunderabad) చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahankali) బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని తెలంగాణ రవాణ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. జులై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాల (Bon festival)ను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలు నిర్వహించుకోవాలన్నారు. గతేడాది ప్రభుత్వం తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా బోనాలు నిర్వహించామని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు.