Minister Ponguleti : వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం : మంత్రి పొంగులేటి

ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనా అధికారి ఉంటారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పరిపాలనా అధికారుల నియామకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వీఆర్‌వో(VRO), వీఆర్‌ఏ (VRA)లుగా పని చేసినవారికి జీపీవోలుగా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక పరీక్ష ద్వారా 3,454 మంది అర్హత సాధించారని వెల్లడిరచారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హత పరీక్ష త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు.