Pongulet: ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా? : మంత్రి పొంగులేటి ఆగ్రహం

రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చశారు. నల్గొండ జిల్లా చందంపేటలో భూభారతి (Bhubharati)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతులు ఫిర్యాదుతో ఆర్డీవో రమాణారెడ్డి(RDO Ramana Reddy), తహసీల్దార్ (Tahsildar)లను మంత్రి ప్రశ్నలు అడగగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రెవెన్యూ డివిజన్ (Revenue Division) పై ఏమాత్రం అవగాహన లేకుండా ఎలా ఉన్నారని ఆర్డీవోపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.