Konda Surekha: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : మంత్రి కొండా సురేఖ

ఓ అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. వరంగల్‌లోని కృష్ణా కాలనీలో బాలికల జూనియర్ కళాశాల (Girls’ Junior College) భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ (Aurobindo Pharma Company) కార్పొరేట్ సామాజిక బాధ్యత ( సీఎస్‌ఆర్) కింద రూ.4.5 కోట్లతో భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. క్లియరెన్స్ కోసం మంత్రుల (Ministers) వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని క్లియరెన్స్ ఇస్తుంటారు. మేం మాత్రం మాకు నమా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, సామాజిక బాభ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం అని ఆమె వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు.