Jupally Krishna Rao : ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు : జూపల్లి

ఎస్‌ఎల్‌బీసీ వద్ద ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao ) అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు (SLBC Project )ను ఎందుకని పెండిరగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. హరీశ్‌రావును నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు. తక్కువ లాభం వస్తుందనా? టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే కాంగ్రెస్ (Congress) పేరు వస్తుందనా? నా మూడు ప్రశ్నకలు ఆయన సమాధానం చెప్పాలి. ప్రకృతి విపత్తులనూ బీఆర్‌ఎస్ (BRS) నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయే ఎస్‌ఎల్‌బీసీని ఎందుకు పెండిరగ్‌లో పెట్టారు? ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు. అద్భుతంగా జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు అప్రమత్తం చేసి ఉండకపోతే 40 మంది వరకు కార్మికులు చనిపోయేవారు అని మంత్రి పేర్కొన్నారు.