Asaduddin Owaisi: అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించాలి : అసుదుద్దీన్ ఒవైసీ

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అఖిలపక్ష భేటీ (All party meeting) నిర్వహించాల ని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. ఈ భేటీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju)తో మాట్లాడానని, ఐదు నుంచి 10 ఎంపీలున్న పార్టీలతో భేటీ యోచన ఉన్నట్లు చెప్పారని అన్నారు. తక్కువ ఎంపీలున్న పార్టీలను ఎందుకు ఆహ్వానించరని అడిగా, అందర్నీ పిలిస్తే భేటీకి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఇది కేవలం బీజేపీ ఇతర పార్టీల అంతర్గత భేటీ కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అఖిలపక్ష భేటీ అనే గట్టి సందేశం ఇవ్వాలి. అఖిలపక్షాల సూచనలను ప్రధాని(Prime Minister) మరో గంట సమయం కేటాయించలేరా? మీ సొంత పార్టీకి మెజార్టీ లేదు. ఇది కేవలం రాజకీయ అంశం కాదు. జాతీయ సమస్య. నిజమైన అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మోదీని కోరుతున్నా. పార్లమెంట్ (Parliament)లో ఎంపీలున్న అన్ని పార్టీలను భేటీకి ఆహ్వానించాలి అని డిమాండ్ చేశారు.