Mallareddy: కాంగ్రెస్‌ను సమూలంగా నిర్మూలించాల్సిన సమయం వచ్చింది: మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి (Mallareddy) తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అణుబాంబు లాంటిదని, దాని దృష్టి బీఆర్ఎస్ పార్టీపై పడిందని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి (Mallareddy) ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దారుణంగా ఉందని, ఆ పార్టీని తుడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మల్లారెడ్డి విమర్శించారు. అణుబాంబు లాంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి జపాన్ సైనికుల మాదిరిగా మనం పోరాడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన (Mallareddy) పిలుపునిచ్చారు. అలా చేస్తేనే గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ కోసం ప్రస్తుతం కష్టపడే వారికే భవిష్యత్తులో పదవులు లభిస్తాయని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన నాయకులు భవిష్యత్తులో ఎంపీలు, మంత్రులు అయ్యే అవకాశం ఉందంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.