Mahesh Kumar :గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పథకాలు తెచ్చేది : మహేశ్‌కుమార్ గౌడ్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాలో జరిగిన సామాజికన్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగదు. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పథకాలు తెచ్చేది. హుజూరాబాద్ (Huzurabad) ఎన్నిక కోసమే దళితబంధు తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 18 నెలల్లో చేసింది. అభూత కల్పనలతో సోషల్ మీడియా (Social media)లో బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా జరుగుతోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు. రాష్ట్ర అవసరాలను, హక్కులను గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది. గోదావరి(Godavari )- బనకచర్ల (Banakacharla) పై లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం ప్రకటిస్తాం అని తెలిపారు.