Kaleshwaram : ఆ ప్రాజెక్టు పనికిరాదు.. దాన్ని పూర్తిగా రద్దు చేయాలి : కూనంనేని

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పనికిరాదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దన్నారు. కాళేశ్వరానికి అన్నీ నేనే అన్న కేసీఆర్ (KCR) ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదు. ఎల్లంపల్లి (Yellampally) ద్వారానే పంటకు నీళ్లు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రం భయపడుతోంది. కేశవరావు (Kesava Rao) మృతదేహాన్ని అప్పగించకపోవడం దారుణం అని అన్నారు.