వరంగల్‌లో ప్రముఖ ఐటీ కంపెనీ… డెలివరీ కేంద్రం
ఐటీ పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతోంది. కంపెనీలు తమ కేంద్రాలను ఆయా నగరాల్లో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో బాగంగా వరంగల్‌లో ప్రముఖ ఐటీ కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ డెలివరీ కేంద్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ డెలివరీ కేంద్రం వల్ల వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు చెందిన 150 మంది టెకీలకు వారి సొంత ప్రదేశంలోనే ఉద్యోగాలు వస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.






