KTR: భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి : కేటీఆర్

తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌నేనని, రజతోత్సవ సభ (Silver Jubilee Celebration) కు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎల్కతుర్తితో బీఆర్‌ఎస్ రజతోత్సవ స భపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన తెలంగాణకు ధన్యవాదాలు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నిన్నటి సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు ప్రారంభం మాత్రమే. ఇకపై తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ (KCR) ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటలకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ప్రభుత్వ అరాచకాలను ఎండగడతాం అని అన్నారు.